Tuesday, September 18, 2012

వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి శుభాకాంక్షలు.



ఆత్మీయ బంధువులారా!
వినాయక చవితి శుభాకాంక్షలు.


ది: 19-9-2012. ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి. ఈ రోజు గణపతిని ఆయనకి ఇష్టమైన 21 రకాల ఆకులతో విశేషించి గరికతో పూజ చేసి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, పళ్ళు నివేదన చేయాలి. వ్రత కథ చదివి అక్షతలు శిరస్సున ధరించాలి. పూజలో వాడవలసిన 21 రకాల పత్రినే పద్దతిగా వాడాలి. సంతలో ఎవో కొన్ని పిచ్చి ఆకులు కట్టి అమ్ముతారు. అవన్నీ వేయటం తగదు. ఎమైనా లోపిస్తే వానికి బదులు ఉన్న రకాన్నే వాడటం లేదా అక్షతలను వేస్తూ ఫలానా దానికి ఫలానాది వేస్తున్నం అని చెప్పుకోవాలి. పత్రి 21 రకాలకు వాడుకలోని పేర్లు.....
1.మాచిపత్రి 2.వాకుడు 3.మారేడు 4.గరిక 5. ఉమ్మెత్త 6.రేగు 7. ఉత్తరేణి 8. తులసి 9.మామిడి 10.గన్నేరు 11.విష్నుక్రాంత 12.దానిమ్మ 13. దేవదారు 14.మరువం 15.వావిలి 16.సన్నజాజి 17.తీగె గరిక 18.జమ్మి 19.రావి 20.మద్ది 21.జిల్లేడు.


ఈ 21 పత్రులు అనేక రోగాలు పోగొట్టగల శక్తి కలవి. వీటిని నదులు, చెరువులందు కలుపుట వలన వర్షాకాలపు మురికి, కొత్త నీటి కాలుష్యాన్ని పోగొడతాయి. దూర్వారయుగ్మం అంటే  గరిక. వినాయకుడు ఎలుకను వాహనంగా చేసుకొని 'అనింద్యుడు ' అని పేరు పెట్టాడు. గడ్డి కూడా పూజార్హమే అని గరిక పూజ చేయించుకుంటున్నాడు. గుంజిళ్ళు తీయటం కూడా ఆయనకి ఇష్టమైన పని.

గణాధిపతి అనుగ్రహప్రాప్తిరస్తు. 




Thursday, August 9, 2012

కృష్ణాష్టమి

ది: 9/8/2012 కృష్ణాష్టమి 




ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేడు (9/8/2012 ) శ్రావణ బహుళ అష్టమి. దీనినే 'కృష్ణాష్టమి ' అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున 'కృష్ణ జయంతి ' అని, 'జన్మాష్టమి ' అని కూడా అంటారు.  తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కాన గోకులాష్టమి అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాస లీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పతికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెల్లలేదు.
           భూభారం తగ్గించటానికి పుట్టిన ఆయన రాజుల రూపంలో ఉన్న రాక్షసులను తానే వెదకి చంపే పని పెట్టుకోక జరాసంధుని ద్వారా అందరినీ తన ముందుకు రప్పించుకొని సంహరించాదు. లోకం కోసం భగవద్గీతను బోధించి జగద్గురువు అయ్యాడు. 'శ్రీకృష్ణ పరమాత్మా అని పరమాత్మ వాచకంతో ఆయననే కొలుస్తాం. దీనిని బట్టే ఆయన స్ఠానం గ్రహించాలి. ఆయన చేసినవన్నీ అధర్మాలుగా కనిపించే ధర్మ సూక్ష్మాలు.
            ఈనాడు క్రిష్ణాష్టమీ వ్రతం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి క్రిష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం క్రిష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. శ్రీ క్రిష్ణుని లీలకు చిహ్నంగా ఉట్టి కొట్టడం వంటి వేడుకలు నిర్వహిస్తారు.

శ్రీ క్రిష్ణ శరణం మమ.
శుభం భూయాత్.

Tuesday, July 31, 2012

శ్రావణ పౌర్ణమి -జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి -జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి



ది:02-08-2012 నాడు శ్రావణ పౌర్ణమి. దీనినే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు.ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు "యజ్ఞోపవీతం పరమం పవిత్రం" అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని తీసివేస్తారు. ఆ సంవత్సరమే  ఉపనయనం అయిన నూతన వటువునకు ఈ రొజు ముంజ విదుపు లేదా ఉపాకర్మ కార్యక్రమం నిర్వహిస్తారు.

సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈ నాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతి ఇచ్చి, వారి కుది చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండివంటలు పెట్టి త్రుప్తి పరుస్తుంది. ఈ రక్షను మిత్రులు కూడా పరస్పరం కట్టుకొనవచ్చును. రక్ష కట్టుకునేటప్పుడు

" యెన బద్ధో బలీ రాజా - దానవేంద్రో మహాబలః ,
  తేనత్వాం అభి బధ్నామి - రక్షే మా చల మా చల"

అని చదవాలి. సోదరుడు తన సోదరిని, ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణకు ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ.

ఉపవతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే.మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతతి వాడైనా ధర్మం కోసం దారపు పోగుకి కూదా జీవితాంతం కట్టుబది ఉంటాడనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది

Friday, July 27, 2012

27th July, 2012 – శుక్ర వారము – వరలక్ష్మీవ్రతము


Varalakshmi Vratamu


ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొంటే, వరలక్ష్మి వరములు ప్రసాదింపగలదని, ధన, కనక, వస్తు, వాహనాదులు లోటులేకుండా అనుగ్రహింపగలదని ప్రతీతి. సువాసినులు, అంటే ముత్తయిదువులు అందరూ ఈవ్రతం చేస్తారు. దీనిద్వారా సౌభాగ్యం పొందగలుగుతారు. దీనిని ప్రత్యేకంగావున్న కల్పమును అనుసరించి నిర్వహించుకొనాలి. Read the rest of this entry »


Saturday, July 14, 2012

16-07-2012 న కటక సంక్రమణం.

16-07-2012 న కటక సంక్రమణం.



ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. 16-07-2012 న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవెశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప 'దక్షిణాయనే' అని చెప్పాలి. సూర్యుడు మేషం,  వౄషభం ఇలా ఆయా రాసులలొ ప్రవేశించే  సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. అన్ని సంక్రమణ సమయాలూ పుణ్య కాలాలే. కాని మిగిలిన మేషాది  సంక్రాంతుల కంటె ఈ కటక  సంక్రమణ కాలం విశేషమైనది. దీని కంటే  మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయములొ స్నాన, దానాలు చెయాలి. తండ్రి లేని వారు పితృదేవతలకు తిల తర్పణాలు  వదలాలి. కర్కాటక  సంక్రమణం రోజున వరాహ స్వామి పూజ, ఉపవాసం కర్తవ్యాలు. సంక్రమణం రాత్రి 8.45 గం. కి జరుగుతొంది. కావున శిష్టాచారం పాటింపదలచిన వారు అప్పుడే  స్నానం చేయటం మేలు. సామాన్యులు మరుసటి రోజు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు. సంక్రమణ తిల తర్పణాలు  17 వ తేదీనే చేయాలి. తిల తర్పనలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటి పూట భోజనం చేయాలి. అందరికీ కటక సంక్రమణ శుభాకాంక్షలు. శుభం భూయాత్.

Sunday, July 1, 2012

గురుపౌర్ణిమ( 3- July - 2012) శుభాకాంక్షలు.

గురుపౌర్ణిమ( 3- July - 2012)   శుభాకాంక్షలు.




ఆద్యాత్మిక బంధువులకు గురుపౌర్ణిమ( 3- July - 2012)   శుభాకాంక్షలు. ఆనాడు ఎవరికి వారు తమ గురువుని పూజించాలి. వేద విభజన ద్వారా, పురాణ వాజ్ఞయము ద్వారా మనకు అనంత విజ్ఞానాన్ని అదించినవారు వ్యాస భగవానుడు. కావున గురువుగా ఆయన్ని పూజించుట సంప్రదాయమైంది. ప్రతివారికి తొలి గురువు తల్లి. అనంతరం తండ్రి. వారికి నమస్కరించటం, పూజించుటం కూడా నేటి కర్తవ్యం.

గురువంటే అక్షరాభ్యాసము నాటి నుండి, నేటి వరకు వందల మంది ఉంటారు కదా, ఎవరు గురువని కొందరి సందేహం.వాళ్ళ జీతాల కోసము కాక మన జీవితము కోసము మనకు విద్య నేర్పినట్టి, మన జన్మ చరితార్ధతకు కారణమైన విద్య నేర్పినట్టి,  మత్రొపదేశము గావించునట్టి, విశేషించి మన మనస్సు ఎవరియందు గురుభావము నిల్పుతున్నదో అట్టివారిని గురువుగా పుజించాలి.

నారాయణ  సమారంభం 

శంకరాచార్య మధ్యమాం

  అస్మదాచార్య  పర్యంతాం 

వందేగురుపరంపరాం 


ఇట్లు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
9848666973



Saturday, June 30, 2012

ఈ రోజు తొలిఏకాదశి


ఈ రోజు తొలిఏకాదశి




ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.