Tuesday, July 31, 2012

శ్రావణ పౌర్ణమి -జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి -జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిది:02-08-2012 నాడు శ్రావణ పౌర్ణమి. దీనినే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు.ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు "యజ్ఞోపవీతం పరమం పవిత్రం" అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని తీసివేస్తారు. ఆ సంవత్సరమే  ఉపనయనం అయిన నూతన వటువునకు ఈ రొజు ముంజ విదుపు లేదా ఉపాకర్మ కార్యక్రమం నిర్వహిస్తారు.

సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈ నాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతి ఇచ్చి, వారి కుది చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండివంటలు పెట్టి త్రుప్తి పరుస్తుంది. ఈ రక్షను మిత్రులు కూడా పరస్పరం కట్టుకొనవచ్చును. రక్ష కట్టుకునేటప్పుడు

" యెన బద్ధో బలీ రాజా - దానవేంద్రో మహాబలః ,
  తేనత్వాం అభి బధ్నామి - రక్షే మా చల మా చల"

అని చదవాలి. సోదరుడు తన సోదరిని, ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణకు ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ.

ఉపవతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే.మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతతి వాడైనా ధర్మం కోసం దారపు పోగుకి కూదా జీవితాంతం కట్టుబది ఉంటాడనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది

Friday, July 27, 2012

27th July, 2012 – శుక్ర వారము – వరలక్ష్మీవ్రతము


Varalakshmi Vratamu


ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొంటే, వరలక్ష్మి వరములు ప్రసాదింపగలదని, ధన, కనక, వస్తు, వాహనాదులు లోటులేకుండా అనుగ్రహింపగలదని ప్రతీతి. సువాసినులు, అంటే ముత్తయిదువులు అందరూ ఈవ్రతం చేస్తారు. దీనిద్వారా సౌభాగ్యం పొందగలుగుతారు. దీనిని ప్రత్యేకంగావున్న కల్పమును అనుసరించి నిర్వహించుకొనాలి. Read the rest of this entry »


Saturday, July 14, 2012

16-07-2012 న కటక సంక్రమణం.

16-07-2012 న కటక సంక్రమణం.ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. 16-07-2012 న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవెశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప 'దక్షిణాయనే' అని చెప్పాలి. సూర్యుడు మేషం,  వౄషభం ఇలా ఆయా రాసులలొ ప్రవేశించే  సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. అన్ని సంక్రమణ సమయాలూ పుణ్య కాలాలే. కాని మిగిలిన మేషాది  సంక్రాంతుల కంటె ఈ కటక  సంక్రమణ కాలం విశేషమైనది. దీని కంటే  మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయములొ స్నాన, దానాలు చెయాలి. తండ్రి లేని వారు పితృదేవతలకు తిల తర్పణాలు  వదలాలి. కర్కాటక  సంక్రమణం రోజున వరాహ స్వామి పూజ, ఉపవాసం కర్తవ్యాలు. సంక్రమణం రాత్రి 8.45 గం. కి జరుగుతొంది. కావున శిష్టాచారం పాటింపదలచిన వారు అప్పుడే  స్నానం చేయటం మేలు. సామాన్యులు మరుసటి రోజు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు. సంక్రమణ తిల తర్పణాలు  17 వ తేదీనే చేయాలి. తిల తర్పనలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటి పూట భోజనం చేయాలి. అందరికీ కటక సంక్రమణ శుభాకాంక్షలు. శుభం భూయాత్.

Sunday, July 1, 2012

గురుపౌర్ణిమ( 3- July - 2012) శుభాకాంక్షలు.

గురుపౌర్ణిమ( 3- July - 2012)   శుభాకాంక్షలు.
ఆద్యాత్మిక బంధువులకు గురుపౌర్ణిమ( 3- July - 2012)   శుభాకాంక్షలు. ఆనాడు ఎవరికి వారు తమ గురువుని పూజించాలి. వేద విభజన ద్వారా, పురాణ వాజ్ఞయము ద్వారా మనకు అనంత విజ్ఞానాన్ని అదించినవారు వ్యాస భగవానుడు. కావున గురువుగా ఆయన్ని పూజించుట సంప్రదాయమైంది. ప్రతివారికి తొలి గురువు తల్లి. అనంతరం తండ్రి. వారికి నమస్కరించటం, పూజించుటం కూడా నేటి కర్తవ్యం.

గురువంటే అక్షరాభ్యాసము నాటి నుండి, నేటి వరకు వందల మంది ఉంటారు కదా, ఎవరు గురువని కొందరి సందేహం.వాళ్ళ జీతాల కోసము కాక మన జీవితము కోసము మనకు విద్య నేర్పినట్టి, మన జన్మ చరితార్ధతకు కారణమైన విద్య నేర్పినట్టి,  మత్రొపదేశము గావించునట్టి, విశేషించి మన మనస్సు ఎవరియందు గురుభావము నిల్పుతున్నదో అట్టివారిని గురువుగా పుజించాలి.

నారాయణ  సమారంభం 

శంకరాచార్య మధ్యమాం

  అస్మదాచార్య  పర్యంతాం 

వందేగురుపరంపరాం 


ఇట్లు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
9848666973