Saturday, July 14, 2012

16-07-2012 న కటక సంక్రమణం.

16-07-2012 న కటక సంక్రమణం.



ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. 16-07-2012 న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవెశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప 'దక్షిణాయనే' అని చెప్పాలి. సూర్యుడు మేషం,  వౄషభం ఇలా ఆయా రాసులలొ ప్రవేశించే  సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. అన్ని సంక్రమణ సమయాలూ పుణ్య కాలాలే. కాని మిగిలిన మేషాది  సంక్రాంతుల కంటె ఈ కటక  సంక్రమణ కాలం విశేషమైనది. దీని కంటే  మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయములొ స్నాన, దానాలు చెయాలి. తండ్రి లేని వారు పితృదేవతలకు తిల తర్పణాలు  వదలాలి. కర్కాటక  సంక్రమణం రోజున వరాహ స్వామి పూజ, ఉపవాసం కర్తవ్యాలు. సంక్రమణం రాత్రి 8.45 గం. కి జరుగుతొంది. కావున శిష్టాచారం పాటింపదలచిన వారు అప్పుడే  స్నానం చేయటం మేలు. సామాన్యులు మరుసటి రోజు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు. సంక్రమణ తిల తర్పణాలు  17 వ తేదీనే చేయాలి. తిల తర్పనలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటి పూట భోజనం చేయాలి. అందరికీ కటక సంక్రమణ శుభాకాంక్షలు. శుభం భూయాత్.

No comments:

Post a Comment