Monday, August 29, 2011

గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు


గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు

గోమాత విశిష్టత
Gomatha - Indian Cow


ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది.  మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.

వావిలిఆకు సమూలం, గుంటకలగర సమూలం సమభాగాలుగా రెండూ కలిపి సుమారుగా ఒకతులం నూరి గిద్దెడు ఆవుపాలతో కలిపి పరగడపున ముట్టు మూడు రోజులు ఈయాలి. ఎటువంటి ముట్టునొప్పిఅయినా పోతుంది. ఆ ముట్టు మూడురోజులు పాలుఅన్నం మాత్రం తినాలి. నాగకేసరములు చూర్ణంచేసి ఆవునేతితో కలిపి స్త్రీ వాకిటనున్న కాలంలో ఇవ్వాలి. పథ్యనియమంలేదు. గర్భమును నశింపజేసే పురుగు దీనివల్ల చచ్చిపోయి గర్భము నిలుస్తుంది. పావుతులం కాకిదొండదుంప చూర్ణం, కాచని ఆవుపాలు నాలుగు ఔన్సులతో కలిపి బయటజేరినరోజు మొదలు నాలుగురోజులు పరగడపున పుచ్చుకొనాలి. ఆవుపాల అన్నం తినాలి. ఇదీ గర్భాన్ని నిలుపుతుంది. మరోపధ్ధతి పెన్నేరుగడ్డ కషాయం కాచి 6 ఔన్సుల కషాయం వడపోసి తీసికొని 6 ఔన్సుల ఆవుపాలు కలిపి కాచి, కషాయం మరిగిపోయి పాలు మిగిలిన పిదప 2 టీస్పూన్ల నేయి కలిపి ముట్టుస్నానం రోజున పుచ్చుకొంటే గర్భం నిలుస్తుంది.


by Dr Annadanam Chidambara Sastry

Thursday, August 25, 2011

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత
Indian Cows in Agriculture


చాలా ముఖ్య విషయ మేమంటే ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త డా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1948 లో మన దేశానికి వచ్చే డా. అమర్ నాధ్ ఝా అనే విద్యవేత్త ద్వారా ఒక సందేశం పంపారు. అది ‘భారతదేశంలో ట్రాక్టర్లవంటి యంత్రాలద్వారా నడిచే వ్యవసాయాన్ని అమలుచేయవద్దు. 400 సంవత్సరాలపాటు యంత్రాలద్వారా వ్యవసాయం చేయడంవల్ల అమెరికాదేశపు వ్యవసాయభూమి నిస్సారమైపోయింది. 10వేల సంత్సరాలపైగా వ్యవసాయం సాగుచున్న భారతదేశపు మట్టిలో సారం, శక్తీ ఇప్పటికీ తరిగిపోలేదు’ అన్నారు. యంత్రములద్వారాకాక గోసంతతిద్వారా వ్యవసాయం చేయటంలోని ప్రయోజనం ఆ శాస్త్రవేత్త సందేశంద్వారా అయినా గ్రహింపక గోసంతతిని నాశనం చేసికొని వినాశందిశగా పరుగులెత్తుతున్నాం. రసాయనిక వనరులతో సాగుతున్న వ్యవసాయం భోజనవిధానాన్ని కుంచింపజేసింది. తత్ఫలితమే ఈనాటి ప్రమాదకరమైన రోగాలు, వాతావరణ కాలుష్యాలు. అందుకే సర్ హోవర్ట్ ‘యంత్రాలద్వారా సాగే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమినాశకమందులు తప్పనిసరి అవుతాయి. యంత్రాలద్వారా జరిగే వ్యవసాయపు టెక్నాలజీ భయంకరమైన వాతావరణకాలుష్యాన్ని వ్యాప్తంజేస్తుంది. అనర్థాలకు ఆలవాలమైన యాంత్రిక వ్యవసాయాన్ని వైజ్ఞానికం అనటం తప్పు’ అన్నారు. పంట దిగుబడి యాంత్రిక, రసాయనిక వ్యవసాయం వలననే పెరిగిన దనుకొనటం భ్రాంతి. పరిశోధనాత్మక కృషితో దేశీయ విధానంలోను వ్యవసాయంచేసి ప్రమాదకరమైన రోగాలకు నిలయంకాని మంచి దిగుబడిని సాధింపవచ్చు.



‘Institute of Economics Guidance in India’ అనే ప్రభుత్వసంస్థ లెక్కల ప్రకారం మన ఎడ్లనిటినీ వ్యవసాయంనుండి తీసేస్తే 2 కోట్ల ట్రాక్టర్లు అవసరమౌతాయట. అందుకు 4,50,000 కోట్ల పెట్టుబడి అవసరమౌతుంది. ఈ ట్రాక్టర్లను నడపటానికి ఏటా 1,75,000 కోట్ల రూపాయల డీజిల్ అవసరం. గోసంపద నాశనమవటంతో యాంత్రిక వ్యవసాయం, దానివల్ల చీడపీడలు పెరిగి రసాయనిక ఎరువులు వాడటంతో రైతుమిత్రులు వానపాములవంటి అవసరజీవులు నశించి భూసారం దెబ్బతిని పైర్లకు రోగాలురాగా క్రిమిసంహారక మందులవాడికతో భూమి విషతుల్యమై సమస్యల వలయాలలో చిక్కి రైతు ఆత్మహత్యకు దిగటం చూస్తున్నాం. గోమాతను, భూమాతను నమ్ముకుంటే ఈగతి పట్టదు. స్వాతంత్ర్యం వచ్చిననాటికి మనదేశంలో 36 కోట్ల పశువులుండగా మరి ఏబదియేండ్లకు అవి 10 కోట్లకు తగ్గిపోయాయి. మాంసం ఎగుమతి 9500 టన్నులకు పెరిగి 30 యాంత్రిక పశువధశాలలకు అనుమతి వచ్చింది. కాడి జోడెడ్లు, ఆవుదూడలను అసలు వాడికలో లేకుండా చేస్తూ ఎలక్షన్లలో వాడుకోవడం మాత్రం జరిగింది. ఇతరదేశాలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులవై నడుస్తోంటే మనం దుబాయ్ షేకులకు మాంసం అమ్ముకొంటూ ప్రమాదంలోకి పోతున్నాయి.
మరో ముఖ్యవిషయ మేమంటే భూకంపాలకు కారణంగూర్చి 1995లో మాస్కో సమీపంలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలలో వివరింపబడింది. ఐన్
స్టీన్ చెప్పిన వేదనాతరంగాలవలె వీరు వెలుగులోకి తెచ్చిన ‘బిస్ ప్రభావము’ భూకంపాలకు కారణమని, ఆ ‘బిస్ ప్రభావానికి’ పశువధశాలలు కారణమని పరిశోధకులు వివరించారు. ఆవుపేడ పిడకలు కాల్చటంవలన వచ్చే పొగ, ఆవుపేడతో అలికిన గోడలు అణుశక్తివల్ల వచ్చే రేడియేషన్ నుండి కాపాడగలవని విదేశీ శాస్త్రజ్ఞులు ఋజువు చేస్తున్నారు. ఆవునెయ్యితో చేసే హోమంవలన వచ్చేపొగ వాతావరణంలోని అనారోగ్య క్రిములను, ఎలర్జీని పోగొడుతుందని, గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని చెప్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు విశృంఖలంగావాడి ఆ ఆహారపదార్థాలను తినడంవల్ల కేన్సర్ వ్యాధి సోకేప్రమాదముందని, కిడ్నీ చెడిపోయే ప్రమాదముందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎరువు, పురుగుమందులు అధికంగా ఉపయోగించడం వలన మనదేశంలో ఏటా 30,000 మంది రైతులు మృత్యువువాత పడుతున్నారని, గోమూత్రం, పేడతో, ఎరువులు వాడితో పై ప్రమాదాలేవీ ఉండవని మేనకాగాంధీ చెప్పారు. వాటివల్ల కాలుష్యం ఏ స్థాయికి వచ్చిందంటే పసిపిల్లలకు తల్లులిచ్చే చనుబాలుకూడా కలుషితమయే తీవ్రస్థాయి ఏర్పడుతోంది. కోటానుకోట్ల ధనం ఎరువులకు, పాలపొడికి వెచ్చిస్తూ గోమాంసం, తోళ్ళు అమ్ముకొని అనేక నష్టాలపాలవడం కాక, భూమిని, మన శరీరాన్ని రోగమయం చేసికొని వినాశాన్ని కొనితెచ్చు కొంటున్నామన్నమాట. ఒక పశువుమూత్రం వినియోగించి సాలీనా 36,000 రూపాయల విలువైన ఎరువులు తయారుచేసుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. గోవుకోసం మనం అంత ఖర్చుపెట్టంకదా! బి.హెచ్.సి., DDT, ఎండ్రిన్, ప్యారామాల్ మోనోక్రోటోఫాస్ వంటి మందులు ఆయాదేశాలలో వాడటం నిషేధించడంతో వానిని మనం కొనితెచ్చుకొని ప్రమాదం కొనితెచ్చుకొంటున్నాము. ఆ దేశాలు వాటిని ఎందుకు నిషేధించాయో, అయినా ఉత్పత్తి చేసి మననెత్తిన ఎందుకు రుద్దుతున్నారో మనం గుర్తించడంలేదు. వాటివల్ల జీన్స్ లోపంకలిగి భవిష్యత్తరాలు దెబ్బతినడానికికూడా మనం విషబీజం నాటుతున్నాం.


http://www.jayahanumanji.com/
By Dr. Annadanam Chidambara Sastry

Monday, July 25, 2011

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత
Indian Cow


గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.


గోమయం - ఆవుపేడ మలినము దుర్గంధాలను పోగొట్టేది. ఇది విషవాయుదోషాన్ని హరిస్తుంది. ఉన్మాదశాంతినికూడా కల్గిస్తుంది. దీనికి కలరా, మశూచి వంటి రోగక్రిములను సంహరింపగల శక్తికూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది. ఆవులకు జొన్నలు పెట్టి అవి పేడతోబాటు బయటకువచ్చిన తరువాత తీసి కడిగి దంచిభుజిస్తే కార్యసిధ్ధి, మహత్తర ఆధ్యాత్మికశక్తి ఏర్పడుతుంది. శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి, పండిత శ్రీరామశర్మ ఆచార్యగార్లు ఆవిధానా న్నుసరించియే ఫలితం సాధించారు. ఆవుపేడలో మెంధాల్, అమ్మోనియా, ఫినాయల్, ఇండాల్, ఫార్మాలిన్ క్రిమినాశక పదార్థాలున్నాయి. గ్రామాలలో ఆవుపేడతో కళ్లాపు చల్లటం, గోడలకు ఆవుపేడ అలకటంలోఉన్న విజ్ఞానాన్ని విజ్ఞానవేత్తలు కొనియాడారు. విదేశాలలో డాక్టర్లు ఆవుపేడతో చేసిన పిడకల పొగను రోగులచే పీల్చునట్లు చేసి సత్ఫలితాలను పొందారు. ఆవుగిట్టలు, కొమ్ములు, వెంట్రుకల పొగవేస్తే కూరగాయల చెట్లకు పట్టే చీడలు తొలగిపోతాయి. సమస్త దోషాలు, క్రిములు తొలగింపగల ఆవుపేడను శుద్దికి ప్రశస్తంగా హిందూసంప్రదాయం స్వీకరించింది. ఆవుపేడతో ఇల్లు అలుకుకొనటం ఎంతో ఆర్థిక ప్రయోజనకారి. కొందరు ముదుసలిఆవు లెందుకు? వానిని చంపితే ఏం? అని అంటారు. గాంధీగారి శిష్యులు, విజ్ఞానవేత్తలు శ్రీ పాంధరీ పాండే అనేవారు 24 సం. కృషిచేసి ముదుసలి ఆవులుసైతం ఆర్థికంగా ప్రయోజనకరాలని నిరూపించారు. ఒక కిలో ఆవుపేడలో 40 కిలోల కంపోస్టుఎరువు తయారు చేయవచ్చని నిరూపించారు. ఆవుపేడతో ఋతురాజు రంగు తయారుచేశారు. ఈ రంగు పూయడంవల్ల ఇల్లు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. యుధ్ధాలలో మారణాయుధాల విషవాయుప్రమాదంనుండికూడా ఇది రక్షణనిస్తుందని నిరూపించారు. ఆవుపేడలో కొన్ని ద్రవ్యాలు కలిపి అగరువత్తులు, బట్టలుతికే పౌడరుకూడా తయారుచేశారు. గోమయం కీటాణువుల పాలిటి మృత్యువే. గోమూత్రంకూడా ఎరువులలో వాడటంవల్ల కీటాణువులు, క్రిములు నాశనంచేసే ఉత్తమఎరువు తయారవుతుంది. కాబట్టి ముదుసలి ఆవులనైనా వధ్యశాలకు పంపటం వినాశహేతువే. ఒక సంవత్సరం పొడువునా ఒక్క ఆవువల్ల లభించే పేడతో 80 టన్నుల ఎరువు తయారుచేయవచ్చు. ఎనిమిది ఎకరాలలో సరిపోయే ఆ ఎరువువెల బజారులో Rs. 17,885/- గా నిర్ణయింపబడింది. గోవర్థన సంస్థ సంయోజకులు చెత్తవంటివి చేర్చి గోమయం వృధాచేయక ప్రయోగాత్మకముగా నిరూపించారు.



www,jayahanumanji.com