Monday, April 4, 2011

ఉగాది ప్రాశస్త్యం

                           


                   మన పండుగల వెనుక ఎన్నో సూత్రాలు ఆదర్శాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఉగాది పండుగ ఒకటి. ఉగాదికి మూలపదం యుగాది. చైత్రే మాసి జగద్ బ్రహ్మా - సుసర్జ ప్రథమే2హని అని చైత్ర మాసం లో మొదటి రోజున అంటే చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు జగత్తుని సృష్టి చేశాడు.కాబట్టి ఆరోజును యుగమునకే ఆదిగా యుగాది అని చెప్పారు. క్రమంగా అదే ఉగాదిగా చెప్పబడింది.
                       సంవత్సరాదినాటి ప్రభావం సంవత్సరమంతా ఉంటుందని మన విశ్వాసం. కాబట్టి ఈ రోజున పెందలకడనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, తలంటు పోసుకుని,క్రొత్త గుడ్డలు ధరించి దేవుని వద్ద దీపారాధన చేసి, దేవుని పూజించి వేపప్రసాదం తినాలి. పంచాంగశ్రవణం చేసి సంవత్సరఫలితం,కర్తవ్యం తెలుసుకుని సుఖశాంతులతో జీవించాలి.అందరకూ నూతనసంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకొనాలి. కాని మనం పాశ్చాత్యుల జనవరి 1నే సంవత్సరాదిగా భావించి అర్ద్ధరాత్రి నిశాచరులలా మెలకువతో ఉండి తాగి తందనాలు తొక్కుతూ అల్లరిగా గదుపుతూ ఉండటంతో సంవత్సరమంతా నిశాచర ప్రవృత్తితో గందరగోళంగానే గడిచిపోతోంది.
                               కాబట్టి మన సంస్కృతిని విలువలను కాపాడుకుందాం. ప్రతి ఇంటా ముగ్గులతో నూతనసంవత్సర శుభాకాంక్షలు ఈరోజున వ్రాద్దాం! తోరణాలు కట్టి మంగళప్రదంగా జరుపుకుందాం.చలివేంద్రం పెట్టి వేసవిలో బాటసారులకు దాహం తీర్చడం ఈ రోజు ఆరంభించాలని శాస్త్రం చెప్తోంది. అలా జలదానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

No comments:

Post a Comment